IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా గీతాగోపినాథ్

 IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా  గీతాగోపినాథ్

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్స్ సత్తాచాటుతున్నారు. ఇటీవల ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ భాద్యతలు చేపట్టగా.. లేటెస్ట్ గా మరో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) సంస్థ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా భారత సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఎంపికయ్యారు. గోపినాథ్ ను డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు IMF ప్రకటించింది. IMF ప్రస్తుత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జియోఫ్రీ ఒకమెటో వచ్చే ఏడాది వైదొలగనున్నారు.  ఈ నేపథ్యంలో  గోపినాథ్ ను కొత్త డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తున్నట్లు  ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియేవా ప్రకటించారు.  

గీతా గోపీనాథ్ మూడు సంవత్సరాల పాటు  IMF చీఫ్ ఎకనామిస్ట్‌గా పనిచేశారు. కొవిడ్ సమయంలో సభ్యదేశాలు ఎదుర్కొంటున్న స్థూల ఆర్థిక సవాళ్ల స్థాయిని ,పరిధిని పెంచడానికి గీత చేసిన కృషిని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించారన్నారు క్రిస్టలినా జార్జియేవా. గోపినాథ్ రాకతో  IMF యొక్క పరిశోధన విభాగం మరింత బలపడుతుందన్నారు. మొదటి డిప్యూటీ ఎండీగా పదోన్నతి కల్పించినందుకు గీతా గోపీనాథ్  ఐఎంఎఫ్​కు ధన్యవాదాలు తెలిపారు.