కోల్‌కతా: ఫామ్‌లేమితో పాటు కీపింగ్‌లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. అతను కుదురుకోవడానికి మరికొంత సమయం ఇవ్వాలన్నాడు. ‘పంత్ సూపర్బ్ ప్లేయర్. అతను నెమ్మదిగా పరిణతిని సాధిస్తున్నాడు. కొద్దిగా సమయం ఇస్తే గొప్ప ప్లేయర్ అవుతాడు. బంగ్లాతో రెండో టీ20లో టీమిండియా అద్భుతంగా ఆడింది’ అని దాదా వెల్లడించాడు. డేనైట్ టెస్ట్‌కు సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని గంగూలీ తెలిపాడు. స్పోర్ట్స్ స్టార్లను సత్కరించి, మ్యాచ్‌కు మరింత వన్నె తెస్తామన్నాడు. బ్యాటింగ్ లెజెండ్ సచిన్, ఒలింపిక్ చాంపియన్ అభివన్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు, బాక్సింగ్ మేరీకోమ్ ఈ మ్యాచ్‌కు హాజరవుతున్నారన్నాడు. ఇప్పటికే వీళ్ల నుంచి కన్ఫర్మేషన్ వచ్చిందని దాదా చెప్పాడు. వీళ్లందరి కోసం మధ్యాహ్నం ఫార్మల్ రిసెప్షన్ ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
సింపుల్‌గా ఆలోచించు: సంగక్కర
బ్యాటింగ్, కీపింగ్ చేస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని సరళంగా ఆలోచించాలని పంత్‌కు.. లెజెండ్ కీపర్ సంగక్కర సలహా ఇచ్చాడు. కాన్ఫిడెన్స్‌ను తిరిగి తెచ్చుకోవాలంటే ఈ విధానాన్ని పాటించాలన్నాడు. ‘ప్రతి విషయం సరళంగా ఉండేలా చూసుకోవాలి. పంత్‌కు ఇది చాలా ముఖ్యం. అతని బలహీనతలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇందుకు సంబంధించిన ప్లాన్స్‌పై కసరత్తులు చేయాలి. ఏ విషయాన్ని ఒత్తిడిగా తీసుకోవద్దు. మ్యాచ్ ఆడేటప్పుడు స్వేచ్ఛగా వ్యవహరించాలి. స్టంప్స్ వెనకాల నీటుగా, నిలకడగా ఉండాలని సూచించాడు.
