బడ్జెట్​లో 60 వేల కోట్లియ్యండి

బడ్జెట్​లో 60 వేల కోట్లియ్యండి
  •  ప్రభుత్వానికి పీఆర్, ఆర్డీ, మిషన్ భగీరథ శాఖల వినతి
  • పంచాయతీ రాజ్ బడ్జెట్​పై మంత్రులు భట్టి, సీతక్క రివ్యూ

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో పంచాయతీరాజ్, రూరల్ డెవలప్​మెంట్, మిషన్ భగీరథ శాఖలకు రూ.60 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రపోజల్స్ అందజేశారు. ఈ నిధులతో ఆసరా పెన్షన్లతో పాటు మహిళా సంఘాలకు రుణాలు, మిషన్ భగీరథ స్కీమ్ అమలు చేస్తారు. ఆసరా పెన్షన్లకు ప్రతి ఏటా రూ.22వేల కోట్లు అవసరం ఉంటాయని సెర్ఫ్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులు తెలిపారు.

అన్ని కేటగిరీలకు ప్రస్తుతం రూ.2,016 ఇస్తుండగా వీటిని రూ.4వేలకు పెంచుతామని, దివ్యాంగులకు ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా దీన్ని రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ప్రకటించింది. ప్రస్తుతం 44 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తుండగా పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేస్తే 69 లక్షలకు పెన్షన్ దారుల సంఖ్య చేరనుంది.

మ‌‌‌‌హిళా సాధికారతకు చ‌‌‌‌ర్యలు చేప‌‌‌‌ట్టాలి

వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక, సాఫ్ట్​వేర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం సెక్రటేరియెట్​లో పీఆర్, మిషన్ భగీరథ, మహిళా స్ర్తీ శిశు సంక్షేమ శాఖలపై మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క అధికారులతో రివ్యూ చేపట్టారు. మహిళా సంఘాలకు అందించే రుణాలతో గ్రామీణ, వ్యవసాయ రంగ ఆధారిత చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేయించాలన్నారు.

ప్రస్తుత మార్కెట్ లో ఆర్గానిక్ పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున మహిళా సంఘాలను అటువైపు మళ్లించాలని సూచించారు. గ్రామాల్లో నీటి సరఫరా ఆగిపోతే, వాటిని ఇన్ టైమ్ లో పునరుద్ధరించడానికి టైం లైన్లు పెట్టుకోవాలన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద చిన్నారులను చూపిస్తూ యాచించే వారిని గుర్తించాలన్నారు. ఆ చిన్నారులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్ర్తీ శిశు సంక్షేమ శాఖలను మంత్రులు ఆదేశించారు. 

వేసవిలో నీటి ఎద్దడి రానియొద్దు

ట్రైబ‌‌‌‌ల్ ఏరియాల్లోని పిల్లల్లో పోషకారలోపం ఎక్కువగా ఉందని మంత్రులు భట్టి, సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లాతో సహా ఏజెన్సీ ప్రాంతాలు, అచ్చంపేటలోని గిరిజన బాలబాలికల్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో కలిసి మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. పీఆర్​, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలకు ఎక్కువ నిధులు కేటాయించాలని భట్టిని సీతక్క కోరారు.

మ‌‌‌‌రో సైన్స్ సెంట‌‌‌‌ర్ ఏర్పాటును పరిశీలించాలి

వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌‌‌‌ర రాజ‌‌‌‌న‌‌‌‌ర్సింహ్మ మాట్లాడుతూ.. వ‌‌‌‌రంగ‌‌‌‌ల్‌‌‌‌లో ప్రస్తుతం ఒక్కటే సైన్స్ సెంట‌‌‌‌ర్ ఉందని, మ‌‌‌‌రో సైన్స్ సెంట‌‌‌‌ర్ ఏర్పాటు అంశాన్ని ప‌‌‌‌రిశీలించాల‌‌‌‌ని భట్టికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జ‌‌‌‌రుగుతున్న దవాఖాన్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాల‌‌‌‌ని కోర‌‌‌‌గా భట్టి అంగీక‌‌‌‌రించారు. వైద్య ఆరోగ్య శాఖ‌‌‌‌కు ప్రతి నెల నిధులు విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని కోరారు.  అలాగే, పేద రోగులకు నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భట్టి ​అన్నారు.  రాష్ట్రంలోని పేద‌‌‌‌, సామ‌‌‌‌ాన్య, మ‌‌‌‌ధ్య త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అంద‌‌‌‌టానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శాఖ‌‌‌‌కు బ‌‌‌‌డ్జెట్‌‌‌‌లో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.