మాకు పోస్టింగ్స్‌‌‌‌ ఇవ్వండి..!

మాకు పోస్టింగ్స్‌‌‌‌ ఇవ్వండి..!

మొదటి లిస్ట్ నియామకాల తర్వాతే రెండో లిస్ట్‌‌‌‌ పోస్టులు భర్తీ చేయాలి
నాన్‌‌‌‌లోకల్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అభ్యర్థులు

అక్టోబర్‌‌‌‌లో యాక్షన్ ప్లాన్ నేపథ్యంలో ఖాళీగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంతో ఎంపికై నా పోస్టింగ్‌‌‌‌ దక్కని నాన్ లోకల్ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మొదటి మెరిట్ లిస్ట్‌‌‌‌లో ఉన్న తమను ముందుగా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ముందు రెండో మెరిట్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ వారికి పోస్టింగ్​ ఇస్తే తాము సర్వీస్‌‌‌‌ లాస్‌‌‌‌ అవుతామని ఆందోళ చెందుతున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన నాన్ లోకల్ అభ్యర్థులు

ఎంపికైనట్లు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ నాన్ లోకల్ పేరుతో సుమారు 500 మంది జూనియర్‌‌‌‌ పంచాయతీ సెక్రటరీలను డీపీవోలు విధుల్లోకి తీసుకోలేదు. వీరిలో 198  అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లు విచారించిన హైకోర్టు పోస్టింగ్‌‌‌‌లు ఇవ్వాలని ఆదేశించింది. అయినా పంచాయతీ రాజ్‌‌‌‌ అధికారులు వారికి పోస్టింగ్‌‌‌‌లు ఇవ్వలేదు. అలాగే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు.
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ నాన్‌‌‌‌లోకల్‌‌‌‌ సమస్య ఏర్పడింది. పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులంతా ప్రస్తుతం నివసిస్తున్న జిల్లాలను లోకల్‌‌‌‌గా అప్లై చేసుకున్నారు. అయితే అధికారులు.. అభ్యర్థులు1 నుంచి 7 వరకు చదువుకున్న జిల్లాను లోకల్‌‌‌‌గా పరిగణించటంతో నాన్‌‌‌‌లోకల్‌‌‌‌గా మారి వీరికి పోస్టింగ్‌‌‌‌లు దక్కలేదు.