కళ్ళతో ప్రేమ పుట్టినట్లు 'ఖుషి' సెకండ్ లిరికల్ అప్డేట్

 కళ్ళతో ప్రేమ పుట్టినట్లు 'ఖుషి' సెకండ్ లిరికల్ అప్డేట్

శివ నిర్వాణ(ShivaNirvana) డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda),సమంత(Samantha) జంటగా నటిస్తోన్న మూవీ ఖుషి(Kushi). ఈ మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఖుషి నుంచి 'ఆరాధ్య'(Aradhya)  అంటూ సాగే ఈ సెకండ్ లిరికల్ ప్రోమో జూలై 10న, పూర్తి పాటను బుధవారం(జూలై 12న) రిలీజ్ చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.

ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ - సమంత రొమాంటిక్‍గా ఉన్నారు.. కళ్ళతో ప్రేమ పుట్టినట్లు, చేతిలో ప్రేమను దాచి ఉంచినట్టు మైమరిచిపోయే ప్రేమికుల్లా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నారు. ఆరాధ్య పాటను తెలుగులో సిధ్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద పాడారు. దర్శకుడు శివ నిర్వాణ ఈ పాటను తెలుగులో స్వయంగా తానే రాశారు. ఆరాధ్య పాట తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రానుంది. అయితే, భాషను బట్టి గాయకులు, లిరిక్ రైటర్స్ వేర్వేరుగా ఉన్నట్లు ప్రకటించారు. 

ఇప్పటికే రిలీజైన 'నా రోజా నువ్వే' సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సాంగ్ లో మణిరత్నం మూవీస్ అన్నీటిని కలిపి లిరిక్స్ ఉండటంతో ఈ పాట ప్రతి ఒక్కరి నోట హమ్మింగ్ అవుతోంది.ఎంతో మంది ప్రేమికులను కదిలిస్తోందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఖుషి మూవీకు హేషమ్ అబ్దుల్ వాహబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. 

ఈ మూవీ రియల్ స్టోరీని బేస్ చేసుకుని వస్తోందని టాక్ వినిపిస్తోంది. సమంత, విజయ దేవరకొండ మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోందని డైరెక్టర్ చాలా సార్లు ప్రస్తావించిన విషయం తెలిసేందే. 

ఖుషిమూవీ సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.