ఈ మందు  ఒమిక్రాన్ కొమ్ములు విరిచేస్తదట!

ఈ మందు  ఒమిక్రాన్ కొమ్ములు విరిచేస్తదట!

లండన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తమ యాంటీబాడీ మందు ‘సోట్రోవిమాబ్’ బాగా పని చేస్తుందని బ్రిటన్ ఫార్మా కంపెనీ గ్లాక్సోస్మిత్ క్లైన్ ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ లో ఏర్పడిన అన్ని 37 మ్యుటేషన్లనూ ఇది అడ్డుకోగలదని వెల్లడించింది. ల్యాబ్ లో సింథటిక్ కరోనా వైరస్, ఒమిక్రాన్ తో పాటు వివిధ వేరియంట్లపై తాము జరిపిన ట్రయల్స్ లో సోట్రోవిమాబ్ సమర్థంగా పని చేసి, వైరస్ ను అడ్డుకోగలిగిందని కంపెనీ తెలిపింది. అమెరికన్ కంపెనీ విర్ బయోటెక్నాలజీ ఇంక్​తో కలిసి ఈ యాంటీబాడీ ట్రీట్​మెంట్​ను గ్లాక్సో కంపెనీ డెవలప్ చేసింది. మైల్డ్, మాడరేట్ సింప్టమ్స్ ఉన్న పేషెంట్లకు సోట్రోవిమాబ్ తో ట్రీట్​మెంట్ అందిస్తే.. హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం, మరణించే ప్రమాదం 79% తగ్గుతున్నట్లుతేలిందని కంపెనీ పేర్కొంది. ఈ మందుకు బ్రిటన్ డ్రగ్ రెగ్యులేటర్ సంస్థ అనుమతి కూడా లభించినట్లు తెలిపింది.