V6 News

భారతీయ యువతితో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పెళ్లి

భారతీయ యువతితో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పెళ్లి

మరో స్టార్ క్రికెటర్ ఓ ఇంటి వాడవుతున్నాడు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్  స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. పెళ్లి కూతురు ఎవరో కాదు..  భారత సంతతికి చెందిన విని రామన్‌ను మాక్స్‌వెల్ వివాహం చేసుకోబోతున్నాడు.  అయితే వీరిద్దరికి 2020లోనే నిశ్చితార్థం అయ్యింది. చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం మెల్‌బోర్న్‌లో జరుగనున్నది. వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను తమిళంలో ప్రింట్‌ చేయగా.. ప్రస్తుతం వీరి శుభ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విని రామన్‌ తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. విని రామన్‌ సైతం అక్కడే పుట్టి పెరగ్గా.. ప్రస్తుతం వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నది. గ్లెన్‌మాక్స్‌వెల్‌ ఒత్తిడికి లోనవగా.. ఆ సమయంలో విని రామన్‌ అతనికి అండగా నిలిచింది. ఆ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీరి వివాహం మార్చి 27న జరుగనుంది. వివాహం నేపథ్యంలో మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలున్నాయి. 

ఈ సారి ఐపీఎల్‌ కూడా మార్చి 27న ప్రారంభం కానుంది. అయితే.. అదే రోజు మ్యాక్స్‌వెల్‌ విని రామన్‌ల పెళ్లి జరుగనున్నది. అలాగే కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ బయో బబుల్‌ చేరేందుకు ముందు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మాక్స్‌వెల్ చాలా మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.ఈసారి మ్యాక్స్‌వెల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 

ఇవి కూడా చదవండి

25 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నుమాయిష్

ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు... అమ్ముడుపోని స్టార్ ప్లేయర్లు