ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు... అమ్ముడుపోని స్టార్ ప్లేయర్లు

ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు... అమ్ముడుపోని స్టార్ ప్లేయర్లు

మొన్నటి వరకు వాళ్లంతా స్టార్ ఆటగాళ్లు. వాళ్ల కోసం ఫ్రాంచైసీలు కోట్లు కుమ్మరించేవి. కానీ సీన్ రివర్స్ అయింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పక్కనపెట్టాయి. మొఖం మీదే మీరు మాకు అవసరం లేదన్నాయి. కాగా ఈ సారి వేలంలో ఇషాన్ కిషన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ రూ. 15.25 కోట్లు వెచ్చించి ఇషాన్ సొంతం చేసుకుంది. మొత్తం 204 మంది ఆటగాళ్లను విక్రయించగా, 10 ఫ్రాంచైజీలు రూ.551.70 కోట్లు వెచ్చించాయి. అయితే, ఈ వేలంలో ఫ్రాంచైజీలు కొంతమంది స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టాయి. ఇండియా ప్లేయర్స్ తో పాటు విదేశీ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. 

వాళ్లెవరెవరంటే.....

సురేశ్ రైనా  (బేస్ ధర రూ. 2 కోట్లు):

ఐపీఎల్‌లో  అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో రైనా నాలుగో స్థానంలో ఉన్నాడు. అతను 205 మ్యాచ్‌లు ఆడి 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు.అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ , రోహిత్ శర్మ లు ఉన్నారు. కానీ స్ట్రైక్ రేటులో వాళ్లందరే కంటే రైనానే ముందున్నాడు. ఐపీఎల్ వేలంలో రైనా ఈ సారి రూ. 2 కోట్ల బేస్ ధర ఆటగాళ్ల జాబితాలలో ఉన్నాడు. అదే ఇప్పుడు అతడికి శాపంగా మారింది. ఏ ఫ్రాంచైజీ అంత డబ్బు పెట్టి రైనాను కొనడానికి ముందుకు రాలేదు. 2021 సీజన్‌లో రైనా చాలా కష్టపడ్డాడు, 12 మ్యాచ్‌ల్లో 17.77 సగటుతో కేవలం 160 పరుగులు చేశాడు

స్టీవ్ స్మిత్  (బేస్ ధర రూ. 2 కోట్లు):

ఆస్ట్రేలియన్ రన్-మెషీన్ గా పిలిచే  స్టీవ్ స్మిత్ ను ఆశ్చర్యకరంగా ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు పక్కన పెట్టాయి. 2021లో స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. స్మిత్ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 25.33 సగటుతో  152 పరుగులు చేశాడు. అతని అనుభవం ఉపయోగపడుతుంది. కానీ అతడిని ఏ జట్టు కొనలేదు.

షకీబ్ అల్ హసన్ (బేస్ ధర రూ. 2 కోట్లు):

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్. ఐసీసి వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ ఏ ఫ్రాంచైజీ షకీబ్ ను కొనడానికి ముందుకు రాలేదు. గతేడాది కేకేఆర్ తరపున తరపున ఆడిన షకీబ్ ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 47 పరుగులు చేసి కేవలం నాలుగు వికెట్లు తీయగలిగాడు.

ఆదిల్ రషీద్ (బేస్ ధర రూ. 2 కోట్లు):

టీ20 ప్లేయర్స్ ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్ మూడవ స్థానంలో ఉన్నాడు ఈ ఇంగ్లండ్ ఆటగాడు. టీ20 లో విజయవంతమైన ఆటగాడిగా ఇతనికి పేరుంది. అయినప్పటికీ ఫ్రాంచైజీలు ఈ స్టార్ ఆటగాడిని పక్కన పెట్టాయి.

ఇమ్రాన్ తాహిర్ (బేస్ ధర రూ. 2 కోట్లు):

వెటరన్ దక్షిణాఫ్రికా స్పిన్నర్‌. ఇప్పుడితడికి 42 ఏళ్లు. వయసే ఈ ఆటగాడికి శాపంగా మారింది. గత సంవత్సరం కూడా, తాహిర్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 4 ఎకానమీ రేటుతో రెండు వికెట్లు తీసుకున్నాడు.

ఆరోన్ ఫించ్ (బేస్ ధర రూ. 1.50 కోట్లు):

ఆస్ట్రేలియన్ వన్డే కెప్టెన్. 2021 ఐపీఎల్ లో ప్రతిభను కనబరిచినప్పటికీ నిలకడగా రాణించలేకపోయాడు. ఫించ్ 2020లో ఆర్ సీబి  తరపున  12 మ్యాచ్ లు ఆడి 268 పరుగులు చేశాడు. కానీ నిలకడ లేకపోవడం ఇతడికి శాపంగా మారింది., 

దావిద్ మలన్ (బేస్ ధర రూ. 1.50 కోట్లు):

ఒకప్పుడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఈ ఇంగ్లీష్ ఆటగాడు అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇటీవలి కాలంలో క్రమంగా ఫామ్ తగ్గింది. పడిపోయాడు. అతను ప్రస్తుతం  ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో 5వ స్థానంలో ఉన్నాడు. అతను గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ తరపున ఆడి చాలా తక్కువ రన్స్ చేశాడు. 

ఇయాన్ మోర్గాన్ (బేస్ ధర రూ. 1.50 కోట్లు):

ఇంగ్లండ్ వైట్-బాల్ కెప్టెన్. ఐపీఎల్ టీ20 లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫైనల్‌ వరకు నడిపించాడు. అక్కడ వారు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు. మోర్గాన్ కెప్టెన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో చాలా  ఇబ్బంది పడ్డాడు.

క్రిస్ లిన్ (బేస్ ధర రూ. 1.50 కోట్లు):

ఆస్ట్రేలియా ఆటగాడు. డేంజరస్ హిట్టర్. ఎపీఎల్, బీపీఎల్ టోర్నీలలో విఫలమయ్యాడు.  గత సీజన్ లో ముంబై ఇండియన్స్ అతన్ని తీసుకుంది. కానీ కేవలం ఒక మ్యాచ్ ఆడవలసి వచ్చింది. కానీ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇతన్ని ఫ్రాంచైజీలు పక్కనపెట్టాయి.

తబ్రైజ్ షమ్సీ (బేస్ ధర రూ. 1 కోటి):

భారత్‌తో జరిగిన వన్డేల్లో ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ తన సత్తా ఏమిటో చూపించాడు. టీ20 ర్యాంకింగ్స్ లో  షమ్సీ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే  బేస్ ధర రూ. 2 కోట్లు ఉండటం కూడా ఇతనికి శాపంగా మారింది. అంత డబ్బు పెట్టి కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఒకవేళ బేస్ ధర రూ. 1 కోటి ఉంటే ఏదో ఓ ఫ్రాంచైజీ షమ్సీని కొని ఉండేదని క్రికెట్ పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం:

నా పోరాటం రాబోయే తరాల కోసమే.. 

ఆర్ఎస్ఎస్ నుంచే ఆప్ పుట్టింది