బంగ్లాదేశ్‌‌‌‌తో రెండో టెస్ట్‌‌‌‌ .. న్యూజిలాండ్‌‌కు ఆధిక్యం

బంగ్లాదేశ్‌‌‌‌తో  రెండో టెస్ట్‌‌‌‌ .. న్యూజిలాండ్‌‌కు ఆధిక్యం

మిర్పూర్‌‌‌‌: బంగ్లాదేశ్‌‌‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌‌‌‌లో న్యూజిలాండ్‌‌‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో స్వల్ప ఆధిక్యం లభించింది. గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (72 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 87) ఒంటరి పోరాటం చేయడంతో.. 55/5 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన కివీస్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 37.1 ఓవర్లలో 180 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో 8 రన్స్‌‌ ఆధిక్యం సాధించింది.  

డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (18)తో ఆరో వికెట్‌‌‌‌కు 49, జెమీసన్‌‌‌‌ (20)తో ఎనిమిదో వికెట్‌‌‌‌కు 55, టిమ్‌‌‌‌ సౌథీ (14)తో తొమ్మిదో వికెట్‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌ జోడించిన ఫిలిప్స్‌‌‌‌ కివీస్‌‌‌‌ను ఆదుకున్నాడు.  మెహిదీ హసన్‌‌‌‌ మిరాజ్‌‌‌‌, తైజుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ చెరో మూడు, షోరిఫుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. 

తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ ప్రారంభించిన బంగ్లాఆట ముగిసే టైమ్‌‌‌‌కు 8 ఓవర్లలో 38/2 స్కోరు చేసింది. జాకీర్‌‌‌‌ హసన్‌‌‌‌ (16 బ్యాటింగ్‌‌‌‌), మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ (0 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా 30 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో ఉంది.