ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం

ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం
  • గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ -2024 లో మంత్రి కోమటి రెడ్డి
  • కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి  సింధియా

హైదరాబాద్: బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ వేదికగా గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్ -2024 గురువారం(జనవరి18) ప్రారంభమైంది. కార్యక్రమానికి  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, జనరల్  వి.కె. సింగ్(రిటైర్డ్), రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటి రెడ్డి.. తెలంగాణ  దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాష్ట్రంలో సులభతర వాణిజ్య విధానం ఉందని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమానం వేయాలని జ్యోతిరాదిత్య సింధియా ను కోమటిరెడ్డి కోరారు.

 "ఎయిర్ అంబులెన్స్ లు ఎక్కువగా హైదరాబాద్ కు వస్తున్నాయి. డ్రోన్ పైలెట్లకు ఎక్కువగా శిక్షణ ఇస్తున్నాం. వ్యవసాయ, అత్యవసరాలకు, శాంతిభద్రతల కోసం డ్రోన్లు వినియోగిస్తున్నం. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలంగా ఉంది". అని కోమటి రెడ్డి చెప్పారు. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నదుకు సంతోషంగా ఉందని తెలిపారు.