జీఎల్‌ఎస్ ఫేస్‌లిఫ్ట్ కార్లను మెర్సిడెజ్ బెంజ్ ఇండియాలో లాంచ్ చేసింది. పెట్రోల్ బండి జీఎల్‌ఎస్ 450 ధర రూ.1.32 కోట్లు కాగా, డీజిల్ వెర్షన్ జీఎల్‌ఎస్ 400 డీ ధర రూ.1.37 కోట్లు (రెండూ ఎక్స్‌షోరూమ్ ధరలు). జీఎల్‌ఎస్ 450 కారులో 3.0 లీటర్ల సిక్స్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.
360 బీహెచ్‌పీ పవర్, 500 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. జీఎల్‌ఎస్ 400 డీ 325 బీహెచ్‌పీ పవర్, 700 ఎన్‌ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేయగలదు..
