Gmail Alert: గూగుల్ అత్యవసర హెచ్చరిక.. వెంటనే మీ జీ-మెయిల్ పాస్‌వర్డ్ మార్చుకోండి..!

Gmail Alert: గూగుల్ అత్యవసర హెచ్చరిక.. వెంటనే మీ జీ-మెయిల్ పాస్‌వర్డ్ మార్చుకోండి..!

Google Warning: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి జీమెయిల్ తమ కమ్యూనికేషన్, డివైజ్ కనెక్షన్ కోసం వినియోగించే మెయిల్ సర్వీస్. దీనిని అమెరికాకు చెందిన ప్రసిద్ధ టెక్ కంపెనీ గూగుల్ ఆఫర్ చేస్తోంది. అయితే తన జీమెయిల్ కస్టమర్లకు కంపెనీ ఒక అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. హ్యాకర్లు బిలియన్ల మంది యూజర్ల డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీనివల్ల పెద్ద స్థాయిలో యూజర్ల అకౌంట్లలోని డేటా టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందని గూగుల్ తెలిపింది. ప్రధానంగా షైనీ హంటర్స్ అనే సైబర్ క్రిమినల్స్ గ్రూప్ జీమెయిల్ ఖాతాలపై దాడులు పెంచిందని హెచ్చరించింది టెక్ దిగ్గజం. 

అసలు ఎవరు ఈ షైనీ హంటర్స్?
షైనీ హంటర్స్ ఒక హ్యాకింగ్ గ్రూప్. ఇది 2020 నుండి యాక్టివ్‌గా సైబర్ అటాక్స్ చేస్తున్న ఒక గ్రూప్. ఇప్పటికే AT&T, మైక్రోసాఫ్ట్, స్టాండర్డ్ బ్యాంక్, టిక్ మాస్టర్ వంటి సంస్థలపై సక్సెస్‌ఫుల్ అటాక్స్ చేసి వారి డేటా వ్యవస్థలను బ్రీచ్ చేసింది. వీరు ప్రధానంగా యూజర్లకు ఫిషింగ్ మెయిల్స్ పంపించటం ద్వారా వారి ఖాతాలను హ్యాక్ చేస్తుంటారని తెలిసింది. నకిలీ మెయిల్స్ పంపి యూజర్లను వారి బ్యాంక్ లాగిన పేజీలకు లింక్స్ పంపి మోసాలకు పాల్పడుతుంది ఈ గ్రూప్. యూజర్లకు చెందిన పాస్‌వర్డ్‌లు, OTPలు లేదా సెక్యూరిటీ కోడ్‌లను దొంగిలిస్తారు ఈ నేరగాళ్లు. పైగా వీరు సేకరించిన డేటాను డార్క్‌వెబ్‌లో లీక్ చేయటం లేదా అమ్మకం చేస్తుంటారు. అందుకే గూగుల్ తన యూజర్లను అప్రమత్తం కావాలంటూ హెచ్చరిస్తోంది. 

మీ జీమెయిల్ అకౌంట్ సేఫ్టీ టిప్స్ ఇవే.. 
యూజర్లు వెంటనే తమ జీమెయిల్ ఖాతాలను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.  దీనికి తోడు తమ అకౌంట్ పాత పాస్ వర్డ్స్ మార్చటం.. ఈసారి బలమైన పాస్ వర్డ్ వినియోగించటం చాలా ముఖ్యమని అంటున్నారు. 

అసలు 2- స్టెప్ వెరిఫికేషన్(2SV) ఎందుకు తప్పనిసరి అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇదొక అదనపు రక్షణ లేయర్ దీనివల్ల సైబర్ నేరగాళ్లు ఖాతా హ్యాక్ చేయకుండా నిరోధించటానికి అవకాశం దొరుకుతుందని వారు చెబుతున్నారు. ఆగస్టు 8న గూగుల్ కొందరు యూజర్లకు వెంటనే తమ పాస్‌వర్డ్ మార్చుకోవాలని, అలాగే 2SV ఆన్ చేయాలని సూచించింది. ఇలా చేయటం వల్ల ఒక వెరిఫికేషన్ కోడ్ యూజర్లకు ఎవరైనా ఖాతా యాక్సెస్ చేయాలని ప్రయత్నించినప్పుడు పంపబడుతుంది. దీంతో హ్యాకర్‌ దగ్గర పాస్‌వర్డ్ ఉన్నా కూడా మీ అకౌంట్‌లోకి ఎంటర్ కాలేడు. అంటే మీ డిజిటల్ డోర్‌కు డబుల్ లాక్ వేసినట్లే.

 భారతీయ యూజర్లకు అలర్ట్..
మన జీమెయిల్ ఖాతాతో షాపింగ్ అకౌంట్లు, సోషల్ మీడియా, యూపీఐ లేదా బ్యాంకింగ్ లాగిన్‌లు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందంటే మొత్తం మీ డిజిటల్ ఐడెంటిటీ రిస్క్‌లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొత్తగా పాస్‌వర్డ్ పెట్టేటప్పుడు చిన్నది కాకుండా.. లాంగ్ & స్ట్రాంగ్ పాస్‌వర్డ్ తప్పనిసరి. ఇందులో అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక సింబల్స్ వంటి మిశ్రమం ఉండేలా చూసుకోండి. 

అలాగే Google Accountలోకి వెళ్లి Security Settings కింద ఉండే 2-Step Verification ఎనేబుల్ చేయండి. అలాగే అనుమానాస్పద లింక్స్ లేదా మెయిల్స్ వస్తే వాటిని అస్సలు ఓపెన్ చేయెుద్దు. అలాగే మీ అకౌంట్‌పై అనుమానాస్పద సైన్-ఇన్ ప్రయత్నాలు జరిగాయా అనే అనుమానం కలిగితే వెంటనే జీమెయిల్ లోని “Recent Security Activity” సెక్షన్‌లో గమనించండి. అలాగే మార్కెట్లో వస్తున్న కొత్త రకం సైబర్ నేరగాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఉండటం మీకు అనదపు అవగాహన రక్షణను కల్పిస్తుంది.