
శంషాబాద్, వెలుగు: న్యూస్ వీక్ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ సంస్థగా జీఎంఆర్ గ్రూప్సత్తా చాటింది. 2024 ఏడాదికి గాను ప్రపంచ వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ తో పాటు ప్యాకేజింగ్ కేటగిరీపై న్యూ స్పీక్ వరల్డ్స్ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీస్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో జీఎంఆర్ గ్రూప్ ఐదో స్థానం దక్కించుకోవడంపై ఆ సంస్థ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ జీబీఎస్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్స్ నిర్వహణలో ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ తర్వాత ఢిల్లీ, బెంగళూరు, గోవాతో పాటు విదేశాల్లో సైతం తనదైన ముద్ర వేసిన జీఎంఆర్ సంస్థ.. ప్రస్తుతం ఏపీలోని భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శరవేగంగా కొనసాగిస్తోంది.