హైదరాబాద్: సౌదీ అరేబియాలో రూ.7,100 కోట్లతో నిర్మించబోయే కొత్త టాయిఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ కోసం జీఎంఆర్ గ్రూప్ పోటీ పడనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం బిడ్ దాఖలు చేయడానికి అర్హత సాధించింది. జీఎంఆర్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు తమసుక్ కన్సార్టియం, టర్కీకి చెందిన టీఏవీ ఎయిర్‌పోర్ట్స్–మాడా ఇంటర్నేషనల్ హోల్డింగ్, ఐరిష్ కంపెనీ డా ఇంటర్నేషనల్ నేతృత్వంలోని కన్సార్టియం, అలాగే కల్యోన్ ఇన్‌సాట్ కూడా అర్హత పొందాయి. ఈ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్లో, 30 ఏళ్ల టైమ్ పీరియడ్ గల బిల్డ్, ట్రాన్స్‌ఫర్, ఆపరేట్ ఒప్పందం కింద అమలు కానుంది. అంటే ప్రాజెక్ట్ పెట్టుబడిని ప్రైవేట్ కంపెనీ పెట్టుకోవాలి. 30 ఏళ్లు నిర్వహించొచ్చు. చివరికి యాజమాన్యం ప్రభుత్వానికి వెళుతుంది.
