ఏపీ రాజధానిపై ప్రజలు ఓపీనియన్ చెప్పొచ్చు

ఏపీ రాజధానిపై ప్రజలు ఓపీనియన్ చెప్పొచ్చు

అమరావతి: ఏపీ రాజధానిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ సిద్ధమైంది జగన్ సర్కారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలా? లేక ఏవైనా మార్పులు చేయాలా? అన్న విషయంపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీని ఇటీవలే నియమించింది. ఇప్పుడు ఆ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ షురూ చేసింది. రాజధానితో పాటు, ఇతర ప్రాజెక్టులపై ప్రజల అభిప్రాయాలను చెప్పాలని కోరింది ఆ కమిటీ.

రాష్ట్రంలో అమలవుతున్న ప్రణాళికలు, అమలు తీరు..రాజధానితో సహా రాష్ట్రాభివృద్ధిపై సూచనలు ఇవ్వాలని కోరింది. ఆ సూచనలను ఈమెయిల్  (expertcommittee2019@gmail.com) లేదా లెటర్ల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ తెలిపింది. నవంబర్‌ 12లోగా ఈ మెయిల్‌ లేదా పోస్ట్‌ ద్వారా పంపాలని సూచించింది.

కొద్దినెలలుగా ఏపీ రాజధాని అమరావతిపై కన్ఫ్యూజన్ నడుస్తున్న క్రమంలో ఇటీవలే జగన్ ప్రభుత్వం జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతి సహా రాష్ట్రంలోని మేజర్ సిటీల అభివృద్ధిపైై ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. ఈ కమిటీ కన్వీనర్ జీఎన్ రావును నియమించింది. ప్రొఫెసర్ మహావీర్, డాక్టర్ అంజలీ మోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం.. సభ్యులుగా ఉన్నారీ కమిటీలో.