
న్యూఢిల్లీ: రాజకీయంగా మహిళలను అణగదొక్కాలన్న ఆలోచనలో బీజేపీ లీడర్లు ఉన్నారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా.. తప్పించుకునే ప్రయత్నం చేస్తారని మండిపడ్డారు. ‘‘మహారాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ ఒకరు వివక్షాపూరిత కామెంట్లు చేశారు.
సుప్రియా సూలే గారూ.. మీరు ఇంటికెళ్లి వంట చేసుకోండి.. మేమంతా దేశాన్ని నడుపుతామని అన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగొద్దనేది బీజేపీ లీడర్ల మైండ్సెట్. బీజేపీ మాజీ చీఫ్ మాటలే ఇందుకు నిదర్శనం” అని సూలే విమర్శించారు. జనగణన, డీలిమిటేషన్ తేదీలే ఇంకా నిర్ణయించలేదని, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును కూడా ప్రవేశపెట్టొచ్చని అన్నారు.