ఎగ్జిట్ పోల్స్ : గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ!

ఎగ్జిట్ పోల్స్ : గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీ!

టూరిస్ట్ స్టేట్ గోవాలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 21 సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. కానీ ఈసారి గోవాలో హంగ్ ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్ పోల్ లెక్కలను బట్టి అర్థమవుతోంది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్కు దాదాపు సమానంగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. టీఎంసీ, ఆమ్ ఆద్మీల్లో ఏ పార్టీ అయినా 4 నుంచి 6 సీట్లు సాధిస్తే అదే కింగ్ మేకర్గా మారనుంది. 

పీ మార్క్ ఎగ్జిట్ పోల్

పీ మార్క్ ఎగ్జిట్ పోల్ ప్రకారం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ తప్పదని అర్థమవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కూటమి దాదాపు ఒకే స్థాయిలో సీట్లు గెలుపొందే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు 13 నుంచి 17 సీట్ల చొప్పున గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. రెండు పార్టీలు కూడా మేజిక్ ఫిగర్ ను క్రాస్ చేసే అవకాశాలు కనిపించడంలేదు. ఆప్ 2 నుంచి 6 స్థానాలు, టీఎంసీ, ఎంజీపీ పార్టీలు 2 నుంచి 4 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతోంది.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచినట్టు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాంగ్రెస్ కూటమి 16 స్థానాలు దక్కించుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించనున్నట్టు ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. బీజేపీ 14 సీట్లతో సరిపెట్టుకోబోతున్నట్టు ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించాయి.ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాగా, ఇతరులు ఆరు స్థానాలు కైవసం చేసుకోవచ్చని అంచనా వేసింది.

సీఎన్ ఎక్స్ 

గోవాలో బీజేపీ 11 నుంచి 16 స్థానాలు కైవసం చేసుకుంటుందని సీఎన్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ 11 నుంచి 17 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు, ఇతరులు 5 నుంచి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెబుతోంది.

జన్ కీ బాత్-ఇండియా న్యూస్ 

జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్  అంచనా ప్రకారం బీజేపీ 13 నుంచి 19 సీట్లు గెలుచుకుంటుందని  తెలిపింది. కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాలు, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ 7 నుంచి 8 సీట్లు, జేడీయూ 5 నుంచి 7 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేశాయి. 

ఇండియా టుడే

గోవాలో బీజేపీ 14 నుంచి 18 సీట్లు.. కాంగ్రెస్ 15 నుంచి 20 సీట్లు సాధిస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. టీఎంసీ 2 నుంచి 5 సీట్లు, ఇతరులు 4 స్థానాలు దక్కించుకుంటాయని అంటోంది.

ఏబీపీ మజా సీ ఓటర్ 

ఏబీపీ మజా సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం గోవాలో బీజేపీ 13 నుంచి 17 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 12 నుంచి 16, టీఎంసీ 4 నుంచి 9 సీట్లను సాధిస్తుందని అంచనా వేసింది. 

ఆత్మసాక్షి

ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్  ప్రకారం గోవాలో కాంగ్రెస్ 21 నుంచి 22 సీట్లు సాధించి అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది. బీజేపీ 9 నుంచి 10 స్థానాలు దక్కించుకుని రెండో పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతోంది. ఆమ్ ఆద్మీపార్టీ 2 సీట్లను కైవసం చేసుకుంటుందని చెప్పింది.