
గోవాలో పర్యాటకులకు జులై 2వ తేదీ నుంచి అనుమతినిస్తున్నట్లు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మనోహర్ తెలిపారు. మొత్తం 250 హోటల్స్ కు నిర్వహణకు అనుమతినిచ్చినట్లు చెప్పారు. మంత్రి మండలి సమావేశంలో పర్యాటక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనుమతులు పొందిన 250 హోటల్స్ కరోనా నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. హోటల్స్ లో ముందే బుక్ చేసుకున్న పర్యాటకులకు మాత్రమే గోవాలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం దగ్గర రిజిష్టర్ చేసుకోని హోటల్స్, హోమ్‌స్టేలను ప్రారంభించేందుకు అనుమతి లేదని చెప్పారు.