నెత్తిన ఒంటి కన్నుతో పుట్టిన మేక..

నెత్తిన ఒంటి కన్నుతో పుట్టిన మేక..

ప్రపంచంలో అప్పుడప్పుడూ పలు వింతలు జరుగుతుంటాయి. మనిషి కడుపున జంతువు పుట్టడం. ఆవు దూడకు రెండు తలలుండటం. వినాయకుని ముఖంతో మనిషి జననం ఇలాంటి వింత ఘటనలు అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇండోనేషియాలో వింత ఘటన చోటు చేసుకుంది.  పాండన్ ఇండాలోని సెంట్రల్ లాంబాక్ రీజెన్సీలో మేక కడుపున మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది. ఈ వింత ఘటనను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

మేకకు పుట్టిన పిల్లకు మనిషి ముఖం ఉండటం చూసిన వారంతా ఇదెక్కడి వింత అంటూ నోరెళ్లబెడుతున్నారు. అచ్చం మనిషి ముఖం లాగే ఉంది ఆ మేకపిల్ల ముఖం. ఒక కన్ను , గడ్డం, ముక్కు, నోరు మాత్రం మనిషి ఈ ముఖాన్ని పోలి ఉండగా.. చెవులు మాత్రం మేకను పోలి ఉంది. శరీరంపై వెంట్రుకలు లేవు. ఆ మేక ముఖం చూడటానికి మనిషి ముఖంలా ఉంది.  ఆ నవ జాత శిశువు  20 నిమిషాలు తరువాత  చనిపోయింది.

అనారోగ్యమే కారణం

మేక బిడ్డకు పుట్టుకతోనే సైక్లోపియా అనే వ్యాధి వచ్చిందని సెంట్రల్ లాంబాక్ అగ్రికల్చరల్ ఏజెన్సీ అధిపతి తౌఫికుర్రహ్మాన్ తెలిపారు.  దీని కారణంగా రూపం మారిందన్నారు.  రెండు కళ్లు విభజన జరగలేదన్నారు.ఇలా పుట్టిన జంతువులు త్వరగా చనిపోతాయని  తౌఫికుర్రహ్మాన్ అన్నారు.