సుడిగాలి సుధీర్ లీడ్‌‌ రోల్‌‌లో గోట్.. టీజర్ రిలీజ్

సుడిగాలి సుధీర్ లీడ్‌‌ రోల్‌‌లో గోట్.. టీజర్ రిలీజ్

సుడిగాలి సుధీర్ లీడ్‌‌ రోల్‌‌లో రూపొందిన చిత్రం ‘గోట్‌‌’. దివ్య భారతి హీరోయిన్‌‌. అద్భుతం, టేనంట్ చిత్రాలను నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా టీజర్‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ ‘తమిళంలో  నాకు  ’బ్యాచిలర్’ మూవీ   ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో  తెలుగులో ‘గోట్’ సినిమా అంతా పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఇలాంటి ఎంటర్‌‌‌‌టైనింగ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. సుధీర్ మల్టీ టాలెంటెడ్. ఆయనతో వర్క్ చేయడం వెరీ గుడ్ ఎక్స్‌‌పీరియెన్స్’ అని చెప్పింది. 

ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఎక్సయిటింగ్‌‌గా ఉంటుందని నటుడు నితిన్ ప్రసన్న అన్నాడు.  ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాని  మేము చాలా బాధ్యతాయుతంగా తీశాం. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చాయి. ముందు చేసిన టీమ్ మాకు అంతగా సపోర్ట్ చేయలేదు.  ఎవరో చేసిన తప్పులకి నిర్మాతగా నాలుగైదు రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టడం  నేను సహించలేకపోయాను. తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త టీమ్‌‌తో సినిమాను పూర్తి చేశాం. కామెడీ మాస్ యాక్షన్‌‌తో ఒక ఫుల్ మీల్స్‌‌లాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు.