
మంచిర్యాల, వెలుగు : హాజీపూర్ మండలం మల్కల్లలోని ర్యాలీ వాగు ప్రాజెక్ట్ వద్ద గుడిపేటకు చెందిన మేకల కాపరి నాగరాజుపై బుధవారం ఎలుగుబంటి దాడి చేసింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని మంచిర్యాల గవర్నమెంట్జనరల్ హాస్పిటల్కు తరలించారు. కండీషన్ సీరియస్గా ఉండడంతో ప్రాథమిక చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు పంపించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు తక్షణ సాయం కింద రూ.20వేలు అందజేశారు.