
రంగారెడ్డి జిల్లాలో మేకల కాపరిని దారుణంగా హత్య చేశారు. తులేకలాన్ గ్రామానికి చెందిన కొరివి యాదయ్య (48)ను ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మేకల మంద వద్దకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో కిరాతకంగా నరికి చంపేశారు. ఆ తర్వాత యాదయ్య మృతదేహాన్ని డొంక దారిలో పడేశారు. సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.సంఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ డీసీపి సన్ ప్రీత్ సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం,డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నారు.