ఇవాళ 'గాడ్‌ఫాద‌ర్' మాస్ సాంగ్ రిలీజ్

ఇవాళ 'గాడ్‌ఫాద‌ర్' మాస్ సాంగ్ రిలీజ్

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రహీరోలగా వెలుగొందుతున్న చిరంజీవి, సల్మాన్ ఖాన్ ల డ్యాన్స్ చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిరు నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ‘సల్లూ భాయ్’ కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ ఓ సాంగ్ లో స్టెప్పులేశారు. సాంగ్‌ ప్రోమోను ఇటీవలే మేకర్స్ వదిలారు. ‘థార్ మార్ థ‌క్కర్ మార్’ సాంగ్ లో స‌ల్మాన్, చిరు డ్యాన్స్ చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కానీ టైం వెల్లడించలేవు. సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. Konidela Pro Company ట్వీట్ చేసింది.

ఒకే రకమైన దుస్తులు ధరించి వీరు డ్యాన్స్ చేశారు. థమన్ సంగీతాన్ని అందించగా.. ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు. శ్రేయా ఘోషల్ పాటని ఆలపించగా.. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమలో హీరో సత్యదేవ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించాడు. ఇందులో చిరుకి చెల్లెలు పాత్రలో నయనతార నటించింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బీ చౌదరి, ఎన్‌వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నారు.