బాసరలో గోదావరి ఉగ్రరూపం.. మునిగిన పుష్కర ఘాట్లు.. ప్రమాద హెచ్చరికలు జారీ..

బాసరలో గోదావరి ఉగ్రరూపం.. మునిగిన పుష్కర ఘాట్లు.. ప్రమాద హెచ్చరికలు జారీ..

తెలంగాలణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా బాసరలో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. క్షణం‌క్షణం వరదనీరు  పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.బాసరలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి నది భారీగా ప్రవహిస్తుండటంతో బాసర సరస్వతి ఆలయం దగ్గర పుష్కర ఘాట్లు మునిగాయి. ఈ క్రమంలో గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలపై నిషేధం విధించారు పోలీసులు.

ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి మూసుకుపోయింది. దీంతో నది దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు రెవిన్యూ అదికారులు.

ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక  ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం వైపు వెళ్లవద్దని పశువుల‌కాపరులను, మేకల కాపరులకు హెచ్చరించారు అధికారులు.