పోలవరం డ్యామ్ వద్ద గోదావరి ఉగ్రరూపం

పోలవరం డ్యామ్ వద్ద గోదావరి ఉగ్రరూపం

పశ్చిమ గోదావరి జిల్లా: పోలవరం డ్యామ్ వద్ద వరద పరవళ్లు అఖండ గోదారిని గుర్తుకు తెస్తోంది.  నిన్న సాగిన పోలవరం స్పిల్ వే కాంక్రీట్, బ్రిడ్జీ పనుల్ని.. ప్రాజెక్ట్ అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు సమాచారం. గోదావరి నదిపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కాపర్ డ్యామ్ వద్ద వరద ప్రవాహం 27 మీటర్లకు చేరింది. దీంతో స్పిల్ వే, స్పిల్ ఛానల్ వరద ముంపునకు గురయ్యాయి.

మరో వైపు శబరి వేగం మరింత జోరు మీదుంది. దీనికి తోడు భద్రాచలం వద్ద వరద గోదారి ఉరకలు వేస్తొంది. భారీ వర్షాలు కొనసాగుతుండడంతో రేపటి వరకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం వరద ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులు ఉండగా.. రేపటికి 9 లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారులు  అంచనా వేస్తున్నారు..  లేదు.. లేదని అనుకుంటూనే ఉన్నా.. గతేడాది గోదారి మహోగ్ర సీను, మరో సారి రిపీట్ అయ్యే అవకాశం ఉందన్న ఆందోళన గుబులు రేపుతోంది. జిల్లా రెవిన్యూ, పోలీస్, మెడికల్ యంత్రాంగం మాత్రం.. ఎలాంటి పరిస్థితి వచ్చినా.. సమర్థ వంతంగా ఎదుర్కొనేందుకు   సర్వసన్నాహాలు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు గోదావరి వరద.. తీరం, ముంపు గ్రామాల్లో స్థితి గతుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.