'గాడ్ ఫాద‌ర్‌' నుంచి ‘థార్ మార్’ సాంగ్ వచ్చేసింది

'గాడ్ ఫాద‌ర్‌' నుంచి ‘థార్ మార్’ సాంగ్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'గాడ్ ఫాద‌ర్‌'. ఈ మూవీ అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా ఇటీవల ఈ మూవీ నుంచి ‘థార్ మార్ థ‌క్కర్ మార్’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ లిరిక‌ల్ వీడియో సాంగ్ ను మేకర్స్ వదిలారు.

ఇవాళ సాయంత్రం 4:05 నిమిషాలకు పాటను విడుదల చేసి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అనంత్ శ్రీరామ్ రచన చేసిన ఈ పాటను పాపులర్ సింగర్ శ్రేయాఘోషల్ ఆలపించగా.. తమన్ సంగీతం అందించాడు. 'బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచండ్రే.. బాక్సులు బద్దల్రె.. డానులు వచ్చిండ్రే.. డాన్సులు దంచుండ్రే.. ఫ్యాన్స్ కి పండగే చూడరే చూడరే.. అంటూ సాగే ఈ పాటను చూస్తే ఫ్యాన్స్ కి నిజంగా విజువల్ ట్రీట్ గా కనిపిస్తోంది.  

చిరు, స‌ల్మాన్ కలిసి స్టెప్పులేసిన ఈ పాట స్టైలిష్‌గా ఉంది. ప్రభుదేవా దర్శకత్వంలో 'థార్ మార్ తక్కర్ మార్' సాంగ్ ని ముంబైలోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో చిత్రీకరించారు. ఇక ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’ కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది.

మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా భారీ స్థాయిలో తెలుగు హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.