పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ రైతులకు ఈజీగా లోన్లు

పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ రైతులకు ఈజీగా లోన్లు

పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్  రైతులను  ఆర్థికంగా ఆదుకునేందుకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐతో కలిసి గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్ కొత్త ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేసింది. పొలాలకు నీళ్లు పెట్టేందుకు, పశువుల నుంచి పంటలను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసే వివిధ ఫెసిలిటీలకు ఈ సంస్థలు రైతులకు లోన్లు ఇస్తాయి. మొక్కలు నాటిన నుంచి మొదటి ఐదేళ్ల వరకు సాయం అందిస్తాయి. ‘పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ సాగులో  రైతుల్లో నమ్మకాన్ని పెంచడానికి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐతో కలిసి  చర్యలు తీసుకుంటున్నాం. పంట చేతికి రావడానికి చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీరియడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులకు ఆర్థిక సాయం చేస్తాం’ అని గోద్రెజ్ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ సౌటా నియోగి అన్నారు.

మొదట ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద తెలంగాణలోని రైతులకు ఆర్థిక సాయం చేశామని, తమిళనాడు, ఒడిస్సా, అస్సాం, మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, త్రిపుర రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ సాయాన్ని విస్తరిస్తామన్నారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద రైతులు రూ. లక్ష నుంచి రూ.50 కోట్ల వరకు లోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఈజీగా పొందొచ్చు. పామ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడంలో గోద్రెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగ్రోవెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, ఏబీయూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజీఎం కేవీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూర్తి అన్నారు. ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేకుండానే రూ.1.6 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్పారు. మొదటిసారిగా పామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయిల్ పండిస్తున్న వారికి ఈ ప్రోగ్రామ్ సాయపడుతుందని అభిప్రాయపడ్డారు.