
హైదరాబాద్, వెలుగు: వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ నిజం చెప్పారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్రిటిష్‌కు ఏజెంట్‌గా ఆర్ఎస్ఎస్ ఉన్నదని అనేక పుస్తకాలలో రాశారని, వీర్ సావర్కర్ కూడా అంతేనని అన్నారు. రాహుల్ అన్నవి ఆరోపణలు కావని, నిజాలని అన్నారు. గాంధీని చంపిన గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ మనిషేనని అన్నారు. రాహుల్ గాంధీ ఫోటోని చెప్పులతో కొట్టండంటూ కర్నాటకలో బీజేపీ చెప్పిందని, మా వద్ద చెప్పులు లేవా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ మీద చెప్పులు వేస్తే మోడీ, అమిత్ షా మీద చెప్పులు పడతాయని ఆయన హెచ్చరించారు. దేవుళ్ల పేరుతో, హిందూ పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు.