
చిత్తూరు జిల్లా: బైకుపై అత్తారింటికి వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు చిన్న గొట్టిగల్లుకు చెందిన శంకరప్ప, హారిక, చిన్నారి లిల్లీగా పోలీసులు గుర్తించారు.
శంకరప్ప హారిక దంపతులు.. తమ రెండేళ్ల చిన్నారితో కలసి అత్తారింటికి బయలుదేరారు. పీలేరు నుంచి బయలుదేరిన కొద్దేసేపటికే మార్గం మధ్యలో గ్యారంపల్లి వద్ద లారీ ఢీకొట్టింది. వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి వైపు ఓ మోటార్ బైక్ పై వెళ్తున్న వీరిని అదే మార్గం నుంచి వెళుతున్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికి అక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది