న్యూఢిల్లీ: బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల పసిడి ధర రూ.2,650 పెరిగి రూ.1,40,850 గరిష్ట స్థాయికి చేరింది. 2024 డిసెంబర్ 31న రూ.78,950 ఉన్న బంగారం ధర ఈ ఏడాదిలోనే రూ.61,900 మేర పెరిగింది.
వెండి ధర కూడా వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. కిలో వెండి రేటు రూ.2,750 పెరగడంతో రూ.2,17,250 ఆల్ టైమ్ హై ధరకు చేరుకుంది. గతేడాది చివరిలో రూ.89,700 ఉన్న వెండి ధర ఈ ఏడాది రూ.1,27,550 పెరిగి 142.2 శాతం లాభాన్ని ఇచ్చింది.
