గురువారం పెద్ద షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. రివర్స్ ర్యాలీతో పెరిగిన రేట్లు..

గురువారం పెద్ద షాక్ ఇచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. రివర్స్ ర్యాలీతో పెరిగిన రేట్లు..

ఈ వారం ప్రారంభం నుంచి వరుసగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు గురువారం ఒక్కసారిగా తిరిగి పెరగటం స్టార్ట్ చేశాయి. దీంతో ఇంకా రేట్లు తగ్గుతాయ్ అని వేచి చూసే ధోరణిలో ఉన్న ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ తగిలింది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు, ఇన్వెస్టర్లు తాజా రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

ఫిబ్రవరి 19న బంగారం రేట్లు ఫిబ్రవరి 18తో పోల్చితే పెరిగాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 649గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 345గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : డిజిటల్ పేమెంట్స్ పెరిగినా తగ్గని నోట్ల జోరు..

ఇక వెండి విషయానికి వస్తే ర్యాలీ తిరిగి స్టార్ట్ అయ్యింది. అయితే గురువారం ఫిబ్రవరి 19, 2025న వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి షాకిచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 70వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.270 వద్ద ఉంది.