Gold Rate: 2 రోజుల్లో తులం రూ.2వేల 890పైకి.. ఇక బంగారం కొనటం కలేనా..!

Gold Rate: 2 రోజుల్లో తులం రూ.2వేల 890పైకి.. ఇక బంగారం కొనటం కలేనా..!

Gold Price Today: అంతర్జాతీయంగా చైనా, అమెరికా బాండ్ మార్కెట్ రాబడులతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ రుణాలపై పెరిగిన ఆందోళనలు ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ముందుకెళ్లేలా చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లకు తిరిగి రెక్కలు వస్తున్నాయి. పెద్ద ఇన్వెస్టర్లు తమ డబ్బును తెలివిగా సేఫ్ హెవెన్ బంగారం లేదా వెండి వంటి లోహాల్లోకి తరలిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇది రిటైల్ స్థాయిలో కొనుగోలు చేసే సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే ప్రస్తుతం పసిడి ధరలు తిరిగి పెరగటం స్టార్ట్ అయ్యింది.

24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 900 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో మారిన గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.9వేల 791, ముంబైలో రూ.9వేల 791, దిల్లీలో రూ.9వేల 806, కలకత్తాలో రూ.9వేల 791, బెంగళూరులో రూ.9వేల 791, కేరళలో రూ.9వేల 791, వడోదరలో రూ.9వేల 796, జైపూరులో రూ.9వేల 806, లక్నోలో రూ.9వేల 806, మంగళూరులో రూ.9వేల 791, నాశిక్ లో రూ.9వేల 794, మైసూరులో రూ.9వేల 791, అయోధ్యలో రూ.9వేల 806, బళ్లారిలో రూ.9వేల 791, గురుగ్రాములో రూ.9వేల 806, నోయిడాలో రూ.9వేల 806గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధర గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8వేల 975, ముంబైలో రూ.8వేల 975, దిల్లీలో రూ.8వేల 990, కలకత్తాలో రూ.8వేల 975, బెంగళూరులో రూ.8వేల 975, కేరళలో రూ.8వేల 975, వడోదరలో రూ.8వేల 890, జైపూరులో రూ.8వేల 990, లక్నోలో రూ.8వేల 990, మంగళూరులో రూ.8వేల 975, నాశిక్ లో రూ.8వేల 978, మైసూరులో రూ.8వేల 975, అయోధ్యలో రూ.8వేల 990, బళ్లారిలో రూ.8వేల 975, గురుగ్రాములో రూ.8వేల 990, నోయిడాలో రూ.8వేల 990 వద్ద ఉన్నాయి.  

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 975 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల 791గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 12వేల వద్ద ఉంది.