రోజురోజుకూ పడిపోతున్న వెండి.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ పరిస్థితి ఏంటంటే..?

రోజురోజుకూ పడిపోతున్న వెండి.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ పరిస్థితి ఏంటంటే..?

కొన్ని రోజులుగా తగ్గుతూ ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ మధ్యతరగతి భారతీయులకు ఊరటను కలిగిస్తున్నాయి. ప్రధానంగా బంగారం పెద్దగా కదలిక లేకపోయినప్పటికీ వెండి వేలల్లో తగ్గుతుండటం బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఇదంతా చూస్తుంటే నిపుణులు చెప్పినట్లుగా గోల్డ్ సిల్వర్ రేట్లు భారీగా తగ్గి అందుబాటు రేట్లలోకి తిరిగి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందు తమ ప్రాంతాల్లోని నేటి రేట్లను తెలుసుకోండి. 

ఫిబ్రవరి 18న బంగారం రేట్లు స్వల్ప తగ్గుదలతో వినియోగదారులకు ఊరటను అందించాయి. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 420గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 135గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : హైదరాబాద్లో రాపిడో డ్రైవర్లు నెలకు ఎంత సంపాదిస్తున్నరో తెలిస్తే..

ఇక వెండి విషయానికి వస్తే ర్యాలీ కొంత నెమ్మదించిందని నిపుణులు అంటున్నారు. అయితే బుధవారం ఫిబ్రవరి 18, 2025న వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి ఊరటను ఇచ్చింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 60వేలుగా ఉంది. అంటే గ్రాము ధర రూ.260 వద్ద ఉంది.