హైదరాబాద్లో రాపిడో డ్రైవర్లు నెలకు ఎంత సంపాదిస్తున్నరో తెలిస్తే..

హైదరాబాద్లో రాపిడో డ్రైవర్లు నెలకు ఎంత సంపాదిస్తున్నరో తెలిస్తే..

హైదరాబాద్​, వెలుగు: తమ నెట్​వర్క్లో పనిచేసే డ్రైవర్లు నెలకు రూ.65 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారని రాపిడో తెలిపింది. హైదరాబాద్​లో ప్రస్తుతం 5.4 లక్షల మందికి పైగా యాక్టివ్ కెప్టెన్లు ఉండగా మొత్తం 34.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ప్రతిరోజూ వీరు రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు ఆర్జిస్తున్నారు. నగరంలో సగం మంది కెప్టెన్లకు ఇదే ప్రధాన ఆదాయ వనరు.

ప్రతి రోజూ సుమారు 9.1 లక్షల ప్రయాణాలు రాపిడో ద్వారా జరుగుతున్నాయి. నెలకు సుమారు 2.43 కోట్ల రైడ్స్ ఉంటున్నాయి. ఆఫీసులు, కాలేజీ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణికులకు కూడా నెలకు రూ.10 వేల వరకు ఆదా అవుతోందని రాపిడో ఒక ప్రకటనలో తెలిపింది.