దాదాపు నెల రోజుల నుంచి ఒక దిశ లేకుండా తగ్గుతూ పెరుగుతూ బంగారం, వెండి రేట్లు దాదాపు ఒకే రేంజ్ లో కొనసాగుతున్నాయి. ఇరాన్ యుద్ధం ముగింపుపై క్లారిటీ రాకపోవటం, ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందనే గందరగోళం ఇన్వెస్టర్లను ఈ లోహాలకు దూరంగా జరిపేసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
మార్చి 28న బంగారం రేటు పెరిగింది. మార్చి 27 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.251 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 809గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 575గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 28, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.250 వద్ద ఉంది.
