చాంగ్వాన్: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియా షూటర్ ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ గోల్డ్ మెడల్‌తో సత్తాచాటాడు. శనివారం జరిగిన 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్లో 16–12తో యూత్ ఒలింపిక్స్ చాంపియన్ జలనా పెక్లర్ (2018)ను ఓడించి గోల్డ్ నెగ్గాడు. విమెన్స్ 50 మీ. రైఫిల్ 3 పొజిషన్స్‌లో అంజుమ్ మౌద్గిల్ ర్యాంకింగ్ రౌండ్‌లో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్ చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆమె పోటీ పడుతుంది.
