బంగారం ధరలు తగ్గినయ్​

బంగారం ధరలు తగ్గినయ్​

న్యూఢిల్లీ: ఇండియాలో గోల్డ్ ధరలు మళ్లీ తగ్గాయి. ఎంసీఎక్స్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల రేటు రూ.500 తగ్గి రూ.51,280గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లలో ధరలు తగ్గుతుండటంతో, దేశీయంగా కూడా గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కేజీకి రూ.1,056 తగ్గి రూ.67,926కు పడిపోయింది. గత నెలలో గోల్డ్ రూ.56,200ను, సిల్వర్ రూ.80 వేల వద్ద రికార్డు గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ రికార్డు గరిష్ట స్థాయిల నుంచి ధరలు పడిపోయాయి. కరోనా వ్యాక్సిన్ డెవలప్‌‌మెంట్స్, ఎకనమిక్ డేటా అంచనాలు మెరుగు కావడం వంటి కారణాలతో గోల్డ్ ధరలు  తగ్గుతున్నట్టు అనలిస్ట్‌‌లు అంటున్నారు. కానీ తక్కువ వడ్డీ రేట్లు, అమెరికా డాలర్ బలహీనంగా ఉండటం, మరోమారు స్టిమ్యులస్ ప్యాకేజీలు ఉంటాయనే అంచనాలు గోల్డ్‌‌కు సపోర్ట్‌‌గానే ఉన్నట్టు కూడా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం 0.7 శాతం తగ్గి ఒక ఔన్స్‌‌కు 1,950.20 డాలర్లు పలికింది. నాస్‌‌డాక్ పడిపోయినప్పటికీ, గోల్డ్ ధరలు కన్సాలిడేట్ అయి, స్థిరంగా కొనసాగుతున్నాయి.