
- రూ.6,000 పెరిగిన వెండి ధర
న్యూఢిల్లీ: పండుగల డిమాండ్ కారణంగా బంగారం ధరలు మంగళవారం కూడా పెరిగాయి. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ. 1.30 లక్షల మార్క్‌ను దాటింది. ధన్తేరస్ పండుగ కోసం భారీ కొనుగోళ్ల కారణంగా ధరలు దూసుకెళ్లాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 2,850 పెరిగి రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ. 1,30,800కు చేరింది.
అంతకుముందు ముగింపు ధర రూ. 1,27,950గా ఉంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ. 2,850 పెరిగి పది గ్రాములకు రూ. 1,30,200 వద్ద కొత్త రికార్డును తాకింది. వెండి ధర కూడా రూ. 6,000 పెరిగి కిలోకు రూ. 1,85,000 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఇది వరుసగా ఐదో రోజు పెరుగుదల.