బంగారం @ రూ. 60 వేలు.. ఆల్ టైం రికార్డ్

బంగారం @ రూ. 60 వేలు.. ఆల్ టైం రికార్డ్

ఆషాఢ మాసం.. శుభ కార్యాలు.. ఇంకెముంది బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. తాజాగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.  నాలుగు వారాలుగా స్థిరంగా  కొనసాగిన  వీటి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.  

జులై 13న  హైదరాబాద్​లో 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలకు చేరుకుంది. అంతకు ముందు రోజుతో పోలిస్తే రూ.380 పెరిగింది (రూ.59 వేల 620). ఇది ఈ మధ్య కాలంలో ఆల్​టైం రికార్డ్​ అని నిపుణులు చెబుతున్నారు. 

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్​ రూ.60 వేలు.. 22 క్యారెట్ల గోల్డ్​ రూ.55వేలుగా ఉంది. ఇది ముందు రోజుతో పోల్చితే రూ.350 అదనంగా పెరిగింది. డాలర్​ ధర 15 నెలల కనిష్ఠానికి పడిపోవడంతో బంగారం రేట్లు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

అమెరికా ఆర్థిక పరిస్థితులు బంగారం ధరల్ని ప్రభావితం చేస్తున్నాయని వారు అంటున్నారు.