బంగారం ధరలు 2025 నవంబర్ 12న తగ్గాయి. గత కొద్దిరోజులుగా పెరుగు తగ్గుతూ వస్తున్న ధరలు ప్రస్తుతం కొనుగోలుదారులకు రిలీఫ్ ఇస్తున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గడానికి చాల కారణాలు చెప్పొచ్చు. ఇవి ప్రపంచ దేశాల యుద్దాలు, రాజకీయ పరిస్థితులు సహా చాల విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే తులం బంగారం ధర లక్ష దాటి లక్షన్నరకి పరుగులు పెడుతుంది. దింతో సామాన్యుల కొనుగోళ్ళు గ్రాములకే పరిమితమవుతుంది. కానీ బంగారం అమ్మకందారులు, విక్రేతలు పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఆశించినంతగా లేకపోయినా బంగారం ధరలు తగ్గడంతో కస్టమర్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు చెబుతున్నారు.
ఇక వెండి ధర కూడా ప్రస్తుతం 2 వేలు పెరిగి కస్టమర్లకు షాకిచ్చింది. వెండి ధర ఇప్పటికే కేజీకి లక్షన్నర దాటి 2 లక్షలకి చేరువవుతుంది. రానున్న రోజుల్లో బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, వచ్చేఏడాది ఆల్ టైం రికార్డ్ సెట్ చేస్తుందని నిపుణులు అంటున్నారు.
24క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ .33 తగ్గి రూ.12,551, 22క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ .30 తగ్గి రూ.11,505, 18క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ .25 తగ్గి రూ.9,413.
10గ్రాముల 24క్యారెట్ల ధర రూ.1,25,510తో రూ.330 తగ్గింది.
10గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,15,050తో రూ.300 తగ్గింది.
10గ్రాముల 18 క్యారెట్ల ధర రూ.94,130 తో రూ.250 తగ్గింది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24క్యారెట్ల ధర రూ.1,25,510, 22 క్యారెట్ల ధర రూ.1,15,050, 18 క్యారెట్ల ధర రూ.94,130
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ,విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ,తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24క్యారెట్ల ధర రూ.1,25,510, 22 క్యారెట్ల ధర రూ.1,15,050, 18 క్యారెట్ల ధర రూ.94,130.
ఇక వెండి ధర గ్రాముకి రూ .162తో కేజీకి రూ.1,62,000 అంటే రూ.2వేలు పెరిగింది. హైదరాబాద్, వరంగల్ కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ,తిరుపతి, కడప, అనంతపురంలో కేజీకి రూ.1,73,000.
