ఈవారం ప్రారంభం నుంచి బంగారం రేట్లు ఎలా తగ్గాయో మధ్యలో అదే స్థాయిలో తిరిగి పెరిగాయి. అయితే వారాంతంలో మాత్రం బంగారం రేట్లు దిగొచ్చాయి. దీంతో షాపింగ్ చేయాలని భావిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ముందుగా మారిన రేట్లను తెలుసుకుని నిర్ణయం తీసుకోవటం బెటర్.
మే30న బంగారం రేట్లు తగ్గాయి. మే 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.60 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 704గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 395గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 30, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 90వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపుగా రూ.290 దగ్గర ఉంది.
