స్థిరంగా వెండి.. దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లివే..

స్థిరంగా వెండి.. దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రేట్లివే..

మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం వెండి ధరలు తీవ్రంగానే ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా గోల్డ్ రేట్లు ఒకరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ దాదాపుగా అదే ధరల వద్ద కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రిటైల్ దుకాణాల్లో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ ప్రాంతంలోని మారిన రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం. 

మే26న బంగారం రేట్లు తగ్గాయి. మే 25 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.49 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 889గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 565గా కొనసాగుతోంది. 

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 26, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు మార్పు లేకుండా రూ.2లక్షల 95వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.295 దగ్గర ఉంది.