అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు యుద్ధంతో బాంబులు పేల్చుతోంటే.. మరోవైపు తన సరికొత్త ఫార్మా టారిఫ్స్ బాంబును ప్రపంచంపై వేశారు. దీంతో పాటు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాలు మళ్లీ బంగారం రేట్లకు మెరుపులు దిద్దుతోంది. దీంతో రోజురోజుకూ గోల్డ్ అండ్ సిల్వర్ లోహాల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.
జూలై 23న బంగారం రేట్లు పెరిగాయి. జూలై 22 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.77 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 728గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 500గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 23, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 45వేలుగా అమ్మబడుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
