హైదరాబాద్, వెలుగు: భారతదేశంలో మొట్టమొదటి డెంగీ వ్యాక్సిన్‌గా అనుమతి పొందిన వ్యాక్సిన్ క్యూడెంగా కోసం ప్రపంచవ్యాప్తంగా 28 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్నిర్వహించామని దీనిని తయారు చేసిన జపాన్ఫార్మా కంపెనీ తకేడా తెలిపింది.
ఈ ట్రయల్స్ ఆధారంగా దీనికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం లభించిందని ప్రకటించింది. 4–60 ఏళ్ల మధ్య వయస్సు గల వారికి ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్ వేయడానికి ముందు ఎలాంటి పరీక్షలూ అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి ఏడు సంవత్సరాల వరకు రక్షణ కల్పిస్తుంది.
