V6 News

అలా తగ్గి ఇలా పెరుగుతున్న గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రేట్లివే..

అలా తగ్గి ఇలా పెరుగుతున్న గోల్డ్.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రేట్లివే..

అంతర్జాతీయ ఒడిదొడుకుల కారణంగా బులియన్ మార్కెట్లు స్థబ్దుగా మారిన సంగతి తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే అనుమానాలు కొనసాగుతున్న వేళ బంగారం ధరలు ఒకరోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో ఆభరణాలు షాపింగ్ చేద్దామనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా మారిన రేట్లను పరిశీలించటం బెటర్. 

ఏప్రిల్29న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.44 పెరుగుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 137గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 875గా కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్29, 2026న దేశవ్యాప్తంగా రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 65వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి.