అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేగవంతం అవుతుండటంతో బంగారం ధరలకు తిరిగి జోరు మెుదలైంది. గతవారం మెల్లమెల్లగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ తిరిగి పుంజుకోవటంతో రిటైల్ కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆభరణాలు కొనాలని భావిస్తున్నవారు ముందుగా తమ ప్రాంతంలోని మారిన రేట్లను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
మే25న బంగారం రేట్లు పెరిగాయి. మే 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.32 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 938గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 610గా కొనసాగుతోంది.
సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 25, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు మార్పు లేకుండా రూ.2లక్షల 95వేలుగానే కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపుగా రూ.295 దగ్గర ఉంది.
