
కూకట్పల్లి, వెలుగు: నగల షాపుల్లో సేల్స్ మెన్స్ దృష్టి మళ్లించి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మియాపూర్‌లోని గోకుల్ టవర్స్‌లో ఉండే సునీత(41) నగలు కొనాలని షాపులకు వెళ్లేది. అక్కడ సేల్స్ మెన్ దృష్టి మళ్లించి నగలు చోరీ చేసేది. ఈనెల 23న కేపీహెచ్‌బీకాలనీ లోని ఓ షాపుకు వెళ్లింది. తనకు ఖరీదైన నగలు చూపించమని అడిగింది. సేల్స్‌మెన్ నగలు చూపించే క్రమంలో అతని దృష్టి మళ్లించి రూ. 2.90 లక్షల విలువ చేసే ఆభరణాలను పట్టుకుపోయింది. షాపు నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.