2023లో బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతాయి?

2023లో బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతాయి?

వచ్చే ఏడాది 2023లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక రంగ నిపుణులు మాత్రం గోల్డ్, సిల్వర్ ఈ ఏడాది మాదిరిగానే 2023 అర్థభాగంలో మందగమనాన్ని కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది పెట్టుబడి దారులకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బంగారం 2023 రెండవ భాగంలో గణనీయమైన రాబడిని ఇస్తుందని చెబుతున్నారు. 

డాలర్ పరంగా ఈ క్యాలెండర్ ఇయర్ లో బంగారం స్వల్పంగా (0.51) శాతం లాభపడింది. రూపాయి పరంగా చూస్తే 11 శాతానికి పైగా లాభపడింది. తక్కువ వడ్డీ రేటు విధానంలో బంగారం ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. మే 2022లో యూఎస్ ఫెడ్  బ్యాంకులు రేట్లను పెంచడంతో గోల్డ్ లాభాలు తగ్గడం  ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాదిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని షా అనే నిపుణడు తెలిపారు. పండుగల డిమాండ్, గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేటు విధానాన్ని బట్టి బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.