బంగారం స్మగ్లింగ్ కేసులో మరో 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

బంగారం స్మగ్లింగ్ కేసులో మరో 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి పేరుతో బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో ఎన ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కొనసాగుతోంది. మొన్న 360 కోట్లకు పైగా విలువైన ఆస్తులు సీజ్ చేసిన ఈడీ తాజాగా బుధవారం నాడు మరో 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసింది. 54 కిలోల బంగారంతోపాటు సంజయ్ అగర్వాల్, రాధికా అగర్వాల్, పర్తం కుమార్ అగర్వాల్ కు చెందిన విల్లాలను ఈడీ కోల్ కతా విభాగం అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే ప్రీతం కుమార్ ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంఎంటీఏసీ, ఎస్టీసీ, డైమండ్ ఇండియా తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డ్యూటీ ఫ్రీ బంగారం కొనుగోలు చేసి.. అవకవకలకు పాల్పడినట్లు అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.