బ్యాగ్ హుక్స్ గా మార్చి బంగారం స్మగ్లింగ్

బ్యాగ్ హుక్స్ గా మార్చి బంగారం స్మగ్లింగ్
  • బీభత్సమైన టాలెంట్ చూపిస్తున్న స్మగ్లర్లు
  • శంషాబాద్ లో అరకిలో బంగారం పట్టివేత

ఇడియట్ సినిమా చూశారా… అందులో ఆలీ బ్యాగుల్లో ఇసుకు తీసుకెళ్తూ పోలీసులకు మస్కా కొడుతుంటాడు. పోలీసులు ఇసుకపైనే దృష్టిపెట్టి… ఆలీ చేస్తున్న బైకుల దొంగతనాన్ని గమనించరు. బైక్ లను రాష్ట్ర సరిహద్దు దాటించేస్తుంటాడు ఆలీ.

కట్ చేస్తే..

నిన్న శంషాబాద్ లోనూ ఇలాంటిదే ఓ బంగారం స్మగ్లింగ్ సీన్ కనిపించింది. ఒక దొంగ… హ్యాండ్ బ్యాగ్ లు.. నడుంకు పెట్టుకునే బెల్టుల హుక్స్ లను బంగారంతో చేసి.. కలర్ మార్చి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఇక్కడ పోలీసులు చాలా తెలివిగా దొంగతనాన్ని పసిగట్టేశారు.

చూస్తే అవన్నీ హ్యాండ్ బ్యాగ్ లే. బెల్టులే. వాటికి అలంకరించిన యాక్సెసరీస్, హుక్స్ కు స్టీల్ లాగా  కలర్స్ వేసి ఉండటంతో.. ఎవరికీ మామూలుగా డౌట్ రాదు. కానీ.. ఆ బ్యాగ్ హుక్స్.. యాక్సెసరీస్ అన్నీ బంగారంతో చేసినవే. వాటికి రంగులు మార్చి… అది బంగారం కాదని కలరింగ్ ఇచ్చారు స్మగ్లర్లు. ఈ విషయం పసిగట్టిన ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు.. ఆ రూపంలో ఉన్న బంగారాన్ని సీజ్ చేశారు.

దుబాయ్ నుంచి అరకేజీ పైగా బంగారాన్ని తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌‌పోర్టు అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కస్టమ్స్​అధికారులు తనిఖీలు జరపగా ఓ ప్రయాణికుడి వద్ద 655 గ్రాముల బంగారం బయటపడింది. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

గురువారం కూడా డీఆర్ఐ, కస్టమ్స్​అధికారులు ఉమ్మడిగా నిర్వహిం చిన ఆపరేషన్ లో కిలో బంగారాన్ని పట్టుకున్నారు. రెండు రోజుల్లో మొత్తం 1,655 గ్రాముల బంగారాన్ని స్వా ధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పా రు.